Sircilla: మానేరు జలాశయానికి భారీగా చేరుతున్న వరద నీరు!
Sircilla: గంభీరావుపేట మండలంలో ఎగువ మానేరు వరద ఉద్ధృతి పెరగడంతో వంతెన పనుల కోసం వేసిన తాత్కాలిక రోడ్డును తొలగించగా, గంభీరావుపేట-లింగన్నపేట రాకపోకలు నిలిచాయి.
Sircilla: మానేరు జలాశయానికి భారీగా చేరుతున్న వరద నీరు!
Sircilla: గంభీరావుపేట: ఎగువ మానేరు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు, నిర్మాణ సంస్థ అప్రమత్తమయ్యారు. గంభీరావుపేట మండల కేంద్రం నుంచి లింగన్నపేట వెళ్లే మార్గంలో నూతన వంతెన నిర్మాణ పనుల నేపథ్యంలో రాకపోకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డును జేసీబీ సాయంతో తొలగించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మానేరులో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో తాత్కాలిక మట్టి కట్టపై నీటి ఉద్ధృతి పెరిగి కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా రోడ్డును తొలగించారు. వరద నీరు సాఫీగా ప్రవహించేలా మార్గాన్ని క్లియర్ చేశారు.
తాత్కాలిక రోడ్డు తొలగించడంతో గంభీరావుపేట–లింగన్నపేట మధ్య ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంభీరావుపేట, లింగన్నపేట వైపు ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు, నిర్మాణ కాంట్రాక్టర్ సూచించారు.
వరద ప్రవాహం తగ్గే వరకు ఈ మార్గంలో ఎవరూ రాకపోకలు సాగించవద్దని, భద్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.




