Manthani: ఆదివరాహ స్వామి ఆలయ అభివృద్ధికి ఎన్టీపీసీ సహకరించాలి!

Manthani: కమాన్‌పూర్ శ్రీ ఆదివరాహ స్వామి ఆలయ అభివృద్ధికి సీఎస్‌ఆర్ కింద సోలార్, స్ట్రీట్ లైట్లు మంజూరు చేయాలని ఎన్టీపీసీ ఈడీకి ఆలయ కమిటీ వినతిపత్రం ఇచ్చింది.

SHANKAR, MANTHANI
Published on: 30 Aug 2026 6:54 PM IST
Manthani
X

Manthani: ఆదివరాహ స్వామి ఆలయ అభివృద్ధికి ఎన్టీపీసీ సహకరించాలి!

మంథాని: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో కొలువుదీరిన పురాతన, స్వయంభూ శ్రీ ఆదివరాహ స్వామి దేవస్థాన అభివృద్ధికి ఎన్టీపీసీ సంస్థ సహకరించాలని ఆలయ అభివృద్ధి కమిటీ కోరింది. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముస్త్యాల దామోదర్, పలువురు డైరెక్టర్లు ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత కు వినతి పత్రం అందజేశారు.

కమాన్ పూర్ లోని శ్రీ ఆదివరాహ స్వామి ఆలయం ఎంతో పురాతనమైనదని, ఈ స్వామి వారిని దర్శించుకునేందుకు కేవలం స్థానిక భక్తులే కాకుండా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని తెలిపారు. అయితే ఆలయానికి వచ్చే ప్రధాన రహదారికి, పలు చోట్ల సరైన వెలుతురు సౌకర్యం లేకపోవడంతో భక్తులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున సామాజిక బాధ్యత (CSR) లో భాగంగా ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయంగా 50 సోలార్ లైట్లు, 30 స్ట్రీట్ లైట్లు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story