Peddapalli: రేపటి నుండే 'అరైవ్ అలైవ్'.. రోడ్డు ప్రమాదాల నివారణకు డీజీపీ కొత్త ప్లాన్!
Peddapalli: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు.
Peddapalli: రేపటి నుండే 'అరైవ్ అలైవ్'.. రోడ్డు ప్రమాదాల నివారణకు డీజీపీ కొత్త ప్లాన్!
పెద్దపల్లి జిల్లా: రామగుండం గోదావరిఖని లోని ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీస్ నివాస గృహాలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి. పెద్దపెల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గౌరవ వందనాన్ని స్వీకరించి పుష్పగుజాలతో స్వాగతం పలికిన కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అంబర్ కిషోర్ ఝ. రేపటినుండి రాష్ట్రవ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం లో భాగంగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో పనిచేస్తున్న ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసు నివాస గృహాలను రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు రామగుండం పర్యటనకు వచ్చిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోలీస్ హౌసింగ్ ఫండ్ 12.29 కోట్లతో నిర్మించిన అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 19
నివాస గృహాలను డిజిపి ప్రారంభించారు. సందర్భంగా డిజిపి మాట్లాడుతూ సోమవారం నుండి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుండి ప్రజా ప్రతినిధులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మరణాల రేటును తగ్గించేందుకు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా ప్రజలను సమాయత్వం చేస్తామని తెలిపారు. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ఎవరు లేరని అన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తోపాట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మహేష్ ఎం భగవత్, వరంగల్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి,
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝ, , కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ ఆలం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు.




