Jammikunta: నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన: సీపీఎస్ రద్దుకు డిమాండ్
Jammikunta: పెండింగ్ డిఏల విడుదల కోసం కరీంనగర్ జిల్లా జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.
Jammikunta: నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన: సీపీఎస్ రద్దుకు డిమాండ్
జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట (బాలురు) ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున శాంతియుత వాతావరణంలో నిరసనలు తెలిపారు.
పెండింగ్ లో ఉన్న డి.ఏ. బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పి.ఆర్.సి ని తక్షణమే ప్రకటించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు పరచి ఒపిఎస్ పెన్షన్ ను పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు "డిమాండ్" చేశారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి తక్షణమే ఏకీకృత సర్వీసు రూల్స్ తెప్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, నెలవారీ పదోన్నతుల జీవోను కార్యాచరణ రూపంలో పెట్టాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు రాం. రాజయ్య , రవీందర్ రెడ్డి తో పాటుగా ఉపాధ్యాయులు బాదం సురేష్ బాబు, ఉపాధ్యాయులు ప్రభాకర్, సంపత్, శ్రీనివాస్, యం.స్వామి, బి.సమ్మయ్య, వి. ప్రకాష్, డి. వరదరాజు, స్రవంతి, వనజ, జ్యోతి, లక్మి, ప్రేమలత, త్రివేణి, శైలజ, పద్మ, వైశాలి,తిరుమల తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని ఎడల రాజధానిని ముట్టడించే దిశగా అడుగులు వేస్తామని హెచ్చరించారు.




