Sultanabad: సుల్తానాబాద్‌లో మానసిక వికలాంగులకు పండ్లు, స్వీట్ల పంపిణీ!

Sultanabad: ప్రముఖ వ్యాపారవేత్త తాటిపల్లి భూపతి పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగుల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ డా. అయిల రమేష్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

KONDAL, SULTANABAD
Published on: 1 Aug 2026 7:21 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్‌లో మానసిక వికలాంగులకు పండ్లు, స్వీట్ల పంపిణీ!

సుల్తానాబాద్: అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని సుల్తానాబాద్ మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తాటి పెళ్లి భూపతి పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం స్థానిక మానసిక వికలాంగుల కేంద్రంలోని వికలాంగులకు అన్నదానం మరియు పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన అయిల రమేష్ మాట్లాడుతూ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా హంగులు, ఆర్భాటాలకు పోకుండా పేదలకు, మానసిక వికలాంగులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవాభావాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వారు కోరారు.

ఈ సందర్భంగా తాటిపల్లి భూపతి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు,ఈ కార్యక్రమంలో కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెళ్లి భాస్కర్, యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్, శివనాత్రి ప్రసాద్ , రమేష్ , జర్నలిస్టులు కత్తర్ల చందర్, ముంజ శ్రీనివాస్, పెగడ మధు, బోయిరి అశోక్, స్నేహితులు నందాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story