Tangallapalli: అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా చూడాలి

Tangallapalli:రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో జరిగిన ఎస్‌ఐఆర్ ఓటర్ల సవరణ గ్రామసభకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Aug 2026 8:27 PM IST
Tangallapalli
X

Tangallapalli: అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా చూడాలి

తంగళ్లపల్లి: ఎస్‌ఐఆర్‌ రెండో విడత ఓటర్‌ సవరణ ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామసభకు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ రెండో విడత ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు బాధ్యతగా తమ ఓటు హక్కును ధ్రువీకరించుకోవాలని సూచించారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను బూత్‌ లెవల్‌ అధికారులకు అందించేలా ఓటర్లకు బూత్‌ లెవల్‌ ఏజెంట్లు అవగాహన కల్పించాలన్నారు.

గైర్హాజరైన ఓటర్ల నమోదు, చిరునామా మారిన ఓటర్ల సమస్యలు, ఒకటికి మించి ఓట్లు నమోదైన వారి వివరాలు, మరణించిన వ్యక్తుల ఓట్ల సవరణకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా బీఎల్‌ఓలకు అందించాలని బీఎల్‌ఏలకు సూచించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందని సంగీతం శ్రీనివాస్ స్పష్టం చేశారు. అర్హులైన ఓటర్లందరి ఓటు హక్కు పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story