Jagtial: జగిత్యాలలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. కలకలం!
Jagtial: జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో బడుగు దుబ్బరాజు అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
Jagtial: జగిత్యాలలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. కలకలం!
Jagtial: రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో బడుగు దుబ్బరాజు అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనా స్థలంలో లభ్యమైన ద్విచక్ర వాహనం ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
రాత్రి వేళ తన ద్విచక్ర వాహనంతో వృద్ధురాలిని ఢీకొట్టినట్లు సదరు అనుమానితుడు ప్రాథమిక విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అయితే ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణమా? లేక దీని వెనుక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలాన్ని డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్ క్లూస్ టీమ్‌తో కలిసి పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story




