Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ఎరువుల షాపులపై విజిలెన్స్ తనిఖీలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో విజిలెన్స్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 18 July 2026 12:23 AM IST
Peddapalli
X

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ఎరువుల షాపులపై విజిలెన్స్ తనిఖీలు!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ​కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ విజిలన్స్ ఎంక్వయిరీలో భాగంగా మండలంలోని 'అన్నదాత ఫర్టిలైజర్ షాప్' ను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

​ఈ తనిఖీల్లో భాగంగా దుకాణంలోని ఎరువుల నిల్వలు (స్టాక్), రికార్డుల ప్రకారం ఉన్న స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం నిబంధనల ప్రకారం అందిస్తున్న ఈ-పాస్ (EPOS) మిషన్ లావాదేవీలను, మొబైల్ యాప్‌లో నమోదైన నిల్వల వివరాలను సరిచూశారు. రికార్డులలో ఉన్న నిల్వలకు, దుకాణంలో ఉన్న నిల్వలకు సరిపోయిందా లేదా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు.

​రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బ్లాక్ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

​ఈ ఉమ్మడి తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సీతారెడ్డి, సీఐ అనిల్, తహసీల్దార్ దినేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి (AO) సంధ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story