Karimnagar: కరీంనగర్ బంద్ నేపథ్యంలో సుంకె రవిశంకర్ హౌస్ అరెస్ట్

Karimnagar: కరీంనగర్ బంద్‌కు ముందు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 9 May 2026 11:22 AM IST
Karimnagar
X

Karimnagar

Karimnagar: కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు బయలుదేరిన ఆయనను మార్గమధ్యంలోనే అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించారు.

ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుంకె రవిశంకర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో రాజ్యాంగం అమలులో ఉందా అని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై పోరాడే ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం దుర్మార్గమైన పాలనకు నిదర్శనమని అన్నారు.

ప్రస్తుత పాలకులు పిరికిపందల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వారు పాలన చేయడానికి అర్హులు కారని విమర్శించారు. పాలన చేయలేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే విధానాలు ఎక్కువ రోజులు సాగవని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story