Sultanabad: సుల్తానాబాద్‌లో రూ.158 కోట్ల భారీ రైస్ మిల్లు కుంభకోణం గుట్టురట్టు

Sultanabad: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో రూ.158 కోట్ల ప్రభుత్వ సిఎంఆర్ (CMR) బియ్యం కుంభకోణానికి పాల్పడిన ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 23 Jun 2026 9:27 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్‌లో రూ.158 కోట్ల భారీ రైస్ మిల్లు కుంభకోణం గుట్టురట్టు

Sultanabad: సుల్తానాబాద్, ఇండస్ట్రీల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటూ తప్పించుకూని తిరుగుతున్న ఇద్దరు రైస్ మిల్లు కేటుగాళ్లను సుల్తానాబాద్ పోలీసులు కష్టడిల్లోకి తీసుకున్నారు. మంగళవారం స్థానిక సర్కిల్ కార్యాలయ ఆవరణలో డీసీపీ భూక్య రామ్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

కరీంనగర్ కట్టరాంపూర్ భగత్ నగర్ కు చెందిన సౌభాగ్య లక్ష్మి ఇండస్ట్రీస్ మేనేజర్ బండారి మారుతి మరొక పార్ట్నర్ సౌఖ్యం అంజయ్య లు కమలాపూర్ మండలం కన్నూరుగ్రామం హనుమకొండ జిల్లా నివాసిలు వీరిద్దరూ కలిసి తెలంగాణ రాష్ట్ర పౌరసరపరాల జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్ తో సిఎంఆర్ ధాన్యం ఒప్పందాన్ని కుదుర్చుకొని, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 2023 సంవత్సరంలో ఇవ్వాల్సిన 3116.360 మెట్రిక్ టన్నులు, 2024 లో 2119.125 మెట్రిక్, టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా,

నిధుల దుర్వినియోగం, అక్రమ విక్రయాలకు పాల్పడ్డారని తెలిపారు. కేవలం 515.558 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అందించి, మిగతా 1603.967 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ బియ్యాన్ని డెలివరీ చేయకుండా ఎగనామం పెట్టాలని పేర్కొన్నారు. బ్యాంకుల వద్ద రైస్ మిల్లుల పేరుతో అప్పులు తీసుకోవడం సివిల్ సప్లై అధికారులకు తెలియకుండా ప్రభుత్వ ధాన్యాన్ని నిందితులు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారని. 2020,25 సంవత్సరంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులతోపాటు పెద్దపెల్లి జిల్లా పౌరసరఫరాల అధికారులు నిలువల తనిఖీలలో,1088.014 వరి ధాన్యం తక్కువ ఉన్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు.

బాధితుడి అభ్యర్థన మేరకు తొంబై రోజుల తోపాటు మరో మూడు నెలల గడువు ఇచ్చిన, ఇద్దరు నిందితులు అధికారులను నమ్మించి ఏడు కోట్ల నష్టం ప్రభుత్వానికి కల్పించారని తెలిపారు. గతంలో బండారి మారుతి రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీరాములపల్లి, ప్రభుత్వానికి 69 కోట్ల మోసం చేశారని, మహాశక్తి ఇండస్ట్రీస్ కోరపల్లి కి 62 కోట్లు, సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ కాట్నపల్లికి 20 కోట్లు, మోసం చేశారని అన్ని కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 158 కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించి, సివిల్ సప్లై సంస్థను, ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు నిర్ధారించారు.

బండారి మారుతిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ మోసాలు తదితర కేసులు నమోదయి ఉన్నాయని తెలిపారు. నిందితులు బండారి మారుతి, సౌఖ్యం అంజయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టుతుండగా సోమవారం కరీంనగర్ కట్టరాంపూర్ జిమ్ములో ఇద్దరు నిందితుల్ని సుల్తానాబాద్ సిఐ రంజిత్ రావు ఆధ్వర్యంలోని ఎస్ఐలు చాక చక్యంగా పట్టుకొని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు డిసిపి రామ్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఏసీబీ కృష్ణ, సీఐ రంజిత్ రావు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు చంద్రకుమార్, మధుకర్, మల్లేష్, సనత్ రెడ్డి అదనపు ఎస్సై అశోక్ రెడ్డి తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story