Manthani: కాకతీయ పాఠశాలలో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమం
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని కాకతీయ హైస్కూల్‌లో ఎస్.ఎల్.ఎం ఆధ్వర్యంలో నీటి పొదుపుపై విద్యార్థుల ర్యాలీ మరియు అవగాహన సదస్సు.
Manthani: కాకతీయ పాఠశాలలో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమం
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కాకతీయ హై స్కూల్ లో ఎస్.ఎల్.ఎం (స్టూడెంట్ లీడ్ మూవ్మెంట్) కార్యక్రమంలో భాగంగా నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీడ్ కోఆర్డినేటర్ పావని ఆధ్వర్యంలో "నీటిని పొదుపు చేద్దాం - భవిష్యత్ తరాలను కాపాడుదాం" అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నీటి సంరక్షణ ప్రాముఖ్యతను చాటారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నీటి విలువ, నీటిని వృథా చేయకుండా వినియోగించడం, అవసరం లేనప్పుడు కుళాయిలు మూసివేయడం, లీకేజీలను వెంటనే సరిచేయడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రీడి ఆర్టిస్ట్ డి. శివరామకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి నీటి చుక్క అమూల్యమైనదని, నీటిని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితమని అన్నారు. ఇంటి వద్ద, పాఠశాలలో, పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ నీటిని బాధ్యతగా వినియోగించాలని విద్యార్థులకు సూచించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ.. నీరు మన జీవనానికి ఆధారమని, నీటి వనరులు రోజురోజుకూ తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించడం ఎంతో అవసరమన్నారు. SLM కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నీటి పొదుపుపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పాఠశాలలోనే కాకుండా తమ ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




