Karimnagar: కరీంనగర్‌లో పోలీస్ వాహనం చోరీ నిందితుడు అరెస్ట్!

Karimnagar: కరీంనగర్‌లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం అపహరణ. నిందితుడి అరెస్ట్, వాహనం స్వాధీనం నిర్లక్ష్యం వహించిన డ్రైవర్‌పై శాఖాపరమైన చర్యలు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 9 Sept 2026 10:54 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో పోలీస్ వాహనం చోరీ నిందితుడు అరెస్ట్!

Karimnagar: కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రభుత్వ పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం అపహరణకు గురైన ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు.

సెప్టెంబర్‌ 07వ తేదీ రాత్రి పెట్రోలింగ్ విధులు ముగిసిన అనంతరం, సుమారు రాత్రి 11:45 గంటల సమయంలో ప్రభుత్వ పెట్రోలింగ్‌ ఇన్నోవా క్రిస్టా వాహనం (TS-09-PA-3794)ను కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో పార్క్‌ చేసి ఉంచారు. ఆ సమయంలో స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సదరు వాహనం అపహరణకు గురైంది.

స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా, మొహమ్మద్‌ అజాజ్‌ (28) అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌ ప్రాంగణంలోకి ప్రవేశించి, తాళం చెవి వాహనంలోనే ఉండటాన్ని గమనించి, దానిని ఆసరాగా చేసుకుని అపహారించినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో నిందితుడికి కుటుంబ కలహాల కారణంగా భార్య విడిచి వెళ్లిపోయిందని, తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనలో భాగంగానే ఈ చర్యకు పాల్పడినట్లు తేలింది.

మరోవైపు, ఈ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సదరు పోలీస్ వాహన డ్రైవర్‌పై కూడా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు (Disciplinary Action) ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు.

బాధ్యతాయుత పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో BNS సెక్షన్‌ 305(b) కింద కేసు నమోదు చేశారు. అపహరణకు గురైన వాహనం విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

నిందితుడు మొహమ్మద్‌ అజాజ్‌ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు ఏసీపీ వెంకటస్వామి వివరించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story