Sircilla: రెడ్డి కార్పొరేషన్ కోసం సెప్టెంబర్ 8న ఇందిరా పార్క్ వద్ద దీక్ష

Sircilla: రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, సంక్షేమ డిమాండ్ల సాధనకు సెప్టెంబర్ 8న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక.

KALEEM, SIRICILLA
Published on: 31 Aug 2026 8:35 AM IST
Sircilla
X

Sircilla: రెడ్డి కార్పొరేషన్ కోసం సెప్టెంబర్ 8న ఇందిరా పార్క్ వద్ద దీక్ష

Sircilla: రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన హక్కులు, సంక్షేమ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 8న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి తెలిపారు. ఈ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. సెప్టెంబర్ 8న ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్‌ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, పేద రెడ్డి కుటుంబాలకు అండగా నిలవాలని వారు డిమాండ్ చేశారు. పేద రెడ్డి కుటుంబాల్లో ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు రైతు బీమా తరహాలో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పేద రెడ్డి విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరాహార దీక్షలు చేపట్టి రెడ్ల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని నాయకులు హెచ్చరించారు.

ఈ సమావేశంలో రెడ్డి ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డి, రాష్ట్ర సహాధ్యక్షుడు పూర్మాని రాంలింగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బండ గోపాల్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరెళ్ల భూమిరెడ్డి, దొంగల బాపురెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, నరెడ్ల రాఘవరెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, సంయుక్త కార్యదర్శి మంద బాల్‌రెడ్డి, కోశాధికారి ఎడ్మల హనుమంతరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అబ్బాడి తిరుపతిరెడ్డి, ప్రచార కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story