Karimnagar: రామడుగు మండలం వెదిరలో వినాయక రెడ్డి సంక్షేమ సంఘం ఏకగ్రీవం!

Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని శ్రీ వినాయక రెడ్డి సంక్షేమ సంఘం నూతన పాలకవర్గాన్ని ఆదివారం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 28 Jun 2026 6:02 PM IST
Karimnagar
X

Karimnagar: రామడుగు మండలం వెదిరలో వినాయక రెడ్డి సంక్షేమ సంఘం ఏకగ్రీవం!

కరీంనగర్ జిల్లా: రామడుగు మండలం వెదిర గ్రామ శ్రీ వినాయక రెడ్డి సంక్షేమ సంఘం నూతన పాలకవర్గాన్ని సంఘం సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంఘం భవనంలో నిర్వహించిన ఎన్నికలలో అధ్యక్షులుగా వంగల సంతోష్ రెడ్డి ,గౌరవాధ్యక్షులుగా వంచ రాజిరెడ్డి ,ఉపాధ్యక్షులుగా వంచ రాంగోపాల్ రెడ్డి, రాళ్ల బండి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కోతి శ్రీనివాస్ రెడ్డి సంయుక్త కార్యదర్శిగా ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, రాళ్ల బండి శ్రీనివాస్ రెడ్డి కోశాధికారిగా రాళ్ల బండి చంద్రశేఖర్ రెడ్డి ప్రచార కార్యదర్శిగా వంచ మధు రెడ్డి కార్యవర్గ సభ్యులుగా వంగల రమణారెడ్డి, రాళ్ల బండి తిరుపతిరెడ్డి, కురుకండ్ల లచ్చిరెడ్డి ,మావురం వెంకటరెడ్డి ,వంచ హనుమంత రెడ్డి, వంచ అంజిరెడ్డి ,వంగల రాంగోపాల్ రెడ్డి లతోపాటు పలువురిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను సంఘం సభ్యులు శాలువాలతో సత్కరించారు.అలాగే కరీంనగర్ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ బి రెడ్డి ప్రేమ్ సాగర్ రెడ్డి లతోపాటు పలువురు రెడ్డి సంఘానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులను సంఘం పెద్దలను శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జిల్లా తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి, రాళ్ల బండి గోపాల్ రెడ్డి, రాళ్ల బండి వెంకటరెడ్డి, వంచ కిష్టారెడ్డి, రాళ్ల బండి శ్రీనివాస్ రెడ్డి, వంగల భూమి రెడ్డి లతోపాటుగా పలువురు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story