Jammikunta: శ్రీరామ కలశ శోభాయాత్ర.. భక్తిపారవశ్యంలో భక్తులు!
Jammikunta: చిన్న జీయర్ స్వామివారి 70వ తిరు నక్షత్ర సందర్భంగా జమ్మికుంటలో శ్రీరామ కలశ శోభాయాత్ర నిర్వహించారు.
Jammikunta: శ్రీరామ కలశ శోభాయాత్ర.. భక్తిపారవశ్యంలో భక్తులు!
జమ్మికుంట: జమ్మికుంటలో శ్రీరామ కలశ శోభాయాత్ర.. భక్తిమయం కలశ అర్చనలు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి యొక్క 70వ తిరు నక్షత్ర ప్రయుక్త (పుట్టినరోజు)సందర్బంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శ్రీరామ హృదయం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయనికి కలశాన్ని భక్తులు శోభా యాత్ర గా తీసుకొచ్చారు. ఆలయ ప్రధానార్చకులు డింగరి హరికృష్ణ ఆచార్యులు కలశానికి అర్చనలు నిర్వహించారు.
భక్తులు కలశానికి బియ్యం సమర్పించారు. అభయాంజనేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు నిర్వహించగా భక్తుల అభిషేకం చేశారు. రామనామస్మరణతో భక్తులు తన్మయం చెందారు.
తమలపాకుల అర్చన నిర్వహించారు. వికాస తరంగిణి ప్రతినిధులు రాజిరెడ్డి, ప్రభాకర్ రావు, సమ్మయ్య, ఎదులాపురం వెంకటేశ్వర్లు, వీరన్న,పుల్లూరి శ్రీనివాస్, పి.సమ్మా రావు, సుంకరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.




