Peddapalli: స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. భవనం పైనుంచి పడి పెద్దపల్లి జిల్లా యువకుడి దుర్మరణం!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గీట్ల సాయి అఖిల్ రెడ్డి (30) స్పెయిన్ దేశంలో ప్రమాదవశాత్తు మృతి చెందారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 29 Jun 2026 9:25 AM IST
Peddapalli
X

Peddapalli: స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. భవనం పైనుంచి పడి పెద్దపల్లి జిల్లా యువకుడి దుర్మరణం!

కాల్వశ్రీరాంపూర్/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గీట్ల సాయి అఖిల్ రెడ్డి (30) స్పెయిన్ దేశంలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. వాలెన్సియా నగరంలో నివాసముంటున్న ఒక భవనం పై అంతస్తు నుండి ఆయన హఠాత్తుగా కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సమాచారాన్ని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఆదివారం కుటుంబ సభ్యులకు అధికారికంగా తెలియజేశారు.

వివరాల్లోకి వెళ్తే...

కూనారం గ్రామానికి చెందిన గీట్ల సుభాషిణి - గుణాకర్ రెడ్డిల కుమారుడైన సాయి అఖిల్ రెడ్డి హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివేందుకు గత జనవరి 24న స్పెయిన్ వెళ్లారు. అక్కడ ఒక హోటల్‌లో చదువుకుంటూ సమీపంలోని ఒక భవనంలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఉంటున్న భవనం పై అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. అఖిల్ రెడ్డి తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్వాల్ బొల్లారంలో నివాసముంటున్నారు. మృతుడికి అనూష అనే సోదరి ఉంది. అఖిల్ మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మృతదేహాన్ని తెప్పించేందుకు ప్రయత్నాలు:

విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్ విజయరమణారావు స్పందించారు. ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో మాట్లాడి, మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున దౌత్యపరమైన చర్యలు ముమ్మరం చేశారు. యువకుడి అకాల మరణంతో కూనారం గ్రామంలోనూ, అటు హైదరాబాద్‌లోని వారి కుటుంబంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story