Sircilla: పోలీస్ కార్యాలయంలో గణనాథునికి ఎస్పీ ప్రత్యేక పూజలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మట్టి గణపతికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ మహేష్ బి. గితే. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

KALEEM, SIRICILLA
Published on: 14 Sept 2026 4:11 PM IST
Sircilla
X

Sircilla: పోలీస్ కార్యాలయంలో గణనాథునికి ఎస్పీ ప్రత్యేక పూజలు!

Sircilla: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా మట్టి గణపతులను పూజించాలని ఎస్పీ సూచించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు పాటిస్తూ పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు మధుకర్, సురేష్, సీఐ మధుకర్, ఆర్‌ఎస్‌ఐలు రాజు, శ్రావణ్ యాదవ్, సాయి కిరణ్, జునైద్, శ్రీనివాస్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA