Sircilla: దేవునిగుట్ట తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. సర్పంచ్ సుజాత కల్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం.
Sircilla: దేవునిగుట్ట తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుజాత కల్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో GPO సుజాత, ఉపసర్పంచ్ రమేష్ నాయక్, వార్డు సభ్యులు మహేశ్వరి, స్వరూప, బుజ్జి, గ్రామపంచాయతీ కార్యదర్శి పవిత్ర, అంగన్‌వాడీ టీచర్ జ్యోతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత కల్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామపంచాయతీ ముందుకు సాగుతోందన్నారు.
Next Story




