Siricilla: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి - సీఐ శ్రీనివాస్

Siricilla: సిరిసిల్లలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని పట్టణ సీఐ శ్రీనివాస్ పిలుపు. పీస్ కమిటీతో సమావేశం.

KALEEM, SIRICILLA
Published on: 11 Sept 2026 8:25 PM IST
Siricilla
X

Siricilla: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి - సీఐ శ్రీనివాస్

సిరిసిల్ల: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సిరిసిల్ల పట్టణ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ అవగాహన కల్పించారు.

గణేష్ మండపాల నిర్వాహకులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని తెలిపారు. ఉత్సవాలు సజావుగా జరిగేలా పీస్ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA