Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో మొరాయించిన 108 అంబులెన్స్

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సాంకేతిక లోపంతో నిలిచిపోయిన 108 అంబులెన్స్. అంబులెన్స్‌లోనే చిక్కుకున్న వృద్ధురాలు.

KALEEM, SIRICILLA
Published on: 7 Aug 2026 2:12 PM IST
Yellareddypet
X

Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో మొరాయించిన 108 అంబులెన్స్

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ వద్ద ఓ 108 అంబులెన్స్ సాంకేతిక లోపంతో ఒక్కసారిగా నిలిచిపోయింది. అంబులెన్స్‌లో ఉన్న వృద్ధురాలు కొంతసేపు అందులోనే చిక్కుకుపోయింది.

సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే మరో అంబులెన్స్‌ను ఘటనాస్థలికి రప్పించి, రోగిని అందులోకి షిఫ్ట్ చేసి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలను కాపాడాల్సిన అత్యవసర సేవల వాహనాలే మధ్యలో నిలిచిపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.

జిల్లాలో నడుస్తున్న పాతబడ్డ 108 అంబులెన్స్‌లకు సరైన నిర్వహణ చేపట్టి, తరచూ సాంకేతిక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అత్యవసర వైద్య సేవల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story