Sircilla: సిరిసిల్లలో అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

Sircilla: సిరిసిల్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో DLSA ఆధ్వర్యంలో యువతకు చట్టపరమైన అవగాహన సదస్సు. పాల్గొన్న లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, విద్యార్థులు.

KALEEM, SIRICILLA
Published on: 12 Aug 2026 10:45 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల: యువత తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, ఇతరుల హక్కులను గౌరవిస్తూ సమాజ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ అన్నారు.

అంతర్జాతీయ యువజన దినోత్సవం–2026 సందర్భంగా బుధవారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, DLSA అధ్యక్షురాలు బి.పుష్పలత ఆదేశాలతో, సీనియర్ సివిల్ జడ్జి, DLSA కార్యదర్శి పి.లక్ష్మణాచారి సమన్వయంతో JAGRITI Scheme–2025లో భాగంగా ‘Empowered Youth’ (సాధికారిత యువత) ఇతివృత్తంతో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. యువతలో చట్టపరమైన అవగాహన, హక్కులు–బాధ్యతలపై చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ సహాయం పొందే విధానం, అందుబాటులో ఉన్న న్యాయ సేవలు, సహాయ వ్యవస్థలపై యువతకు అవగాహన కల్పించారు. సమాజంలో యువత బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని సూచించారు.

JAGRITI Scheme–2025 ద్వారా యువతను న్యాయపరంగా, సామాజికంగా, బాధ్యతాయుతంగా సాధికారులను చేయడం లక్ష్యమని తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.రమాదేవి, లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాదులు గుర్రం ఆంజనేయులు, కుంట శ్రీనివాస్, అరుణ రాఘవపురం, బూర మధుసూదన్, పారా లీగల్ వాలంటీర్ మోర శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story