Sircilla: సిరిసిల్లలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
Sircilla: సిరిసిల్ల జయప్రకాశ్‌నగర్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. తల్లిపాలతో శిశువులకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించిన సీడీపీవో సబిత.
Sircilla: సిరిసిల్లలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
సిరిసిల్ల: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని అంబేద్కర్‌నగర్ సెక్టార్ పరిధిలోని జయప్రకాశ్‌నగర్ కమ్యూనిటీ భవన్‌లో తల్లిపాల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సీడీపీవో సబిత అధ్యక్షత వహించి మాట్లాడుతూ, తల్లిపాలు బిడ్డకు దేవుడిచ్చిన వరమని అన్నారు. శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు, 0 నుంచి 3 సంవత్సరాల వయస్సు వరకు మెదడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.
గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారం, పాటించాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే మొదటి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ టీ. బాండ్, డీసీపీవో, అంగన్‌వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు. అనంతరం ఆరు నెలలు పూర్తి చేసుకున్న చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాన్ని నిర్వహించారు.




