Sircilla: సిరిసిల్ల జిల్లా లోక్ అదాలత్‌లో వేలాది కేసులు పరిష్కారం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా జాతీయ లోక్ అదాలత్. వేలాది కేసులు, ట్రాఫిక్ చలాన్లు పరిష్కారం. పోలీసు అధికారులను అభినందించిన ఎస్పీ మహేష్ గితే.

KALEEM, SIRICILLA
Published on: 13 Sept 2026 11:45 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల జిల్లా లోక్ అదాలత్‌లో వేలాది కేసులు పరిష్కారం!

Sircilla: సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. రాజీకి అవకాశం ఉన్న కేసుల పరిష్కారానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న 228 కేసులు, 56 పెట్టీ కేసులు, 823 డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు, 11,456 ట్రాఫిక్ చలాన్ కేసులు, 75 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారమయ్యాయి.

సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు ఊరట లభించింది. వివిధ బ్యాంకు ఖాతాల్లో నిలుపుదల చేసిన రూ.2,79,030 మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

“రాజీ మార్గమే రాజమార్గం” అనే భావనతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు. ముఖ్యంగా కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐ శ్రావణ్ యాదవ్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుళ్లు, వివిధ పోలీస్ స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్ల సేవలను ఎస్పీ ప్రశంసించారు.

లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధులకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA