Sircilla: సిరిసిల్ల జిల్లా TGO అధ్యక్షుడిగా సయ్యద్ జబీ ఎన్నిక
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల (TGO) సంఘం అధ్యక్షుడిగా సయ్యద్ జబీ, కార్యదర్శిగా బి.సాగర్ ఏకగ్రీవ ఎన్నిక.
Sircilla: సిరిసిల్ల జిల్లా TGO అధ్యక్షుడిగా సయ్యద్ జబీ ఎన్నిక
సిరిసిల్ల: తెలంగాణ గెజిటెడ్ అధికారుల (TGO) జిల్లా సంఘం నూతన అధ్యక్షుడిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ సయ్యద్ జబీ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇరిగేషన్ శాఖకు చెందిన బి.సాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జిల్లా అధికారుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తున్న సయ్యద్ జబీ, TGO సంఘం ఆవిర్భావం నుంచి జిల్లా కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషిస్తూ సంఘ బలోపేతానికి కృషి చేశారు.
సమావేశంలో ఇటీవల జరిగిన బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీ పదవుల భర్తీ, సంఘం భవిష్యత్ కార్యాచరణపై సభ్యులు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం బదిలీపై వెళ్లిన మాజీ జిల్లా అధ్యక్షుడు సమర్ సేన్ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించి, ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ట్రెజరీ శాఖకు చెందిన రసూల్, ఆర్థిక శాఖకు చెందిన చంద్రకళ, ఇంజినీరింగ్ శాఖకు చెందిన అనిల్, వ్యవసాయ శాఖకు చెందిన సాయికిరణ్, సహకార శాఖకు చెందిన రమాదేవి, ఆరోగ్య శాఖకు చెందిన నాగరాజు, తహసీల్దార్ మారుతిరెడ్డి, మిషన్ భగీరథకు చెందిన శ్రీకాంత్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.




