Sircilla: గ్రీవెన్స్ డే వేదికగా బాధితులతో నేరుగా మాట్లాడిన జిల్లా పోలీస్

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డే లో ఎస్పీ మహేష్ బి. గితే 36 ఫిర్యాదులను స్వీకరించి విచారణకు ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 20 July 2026 8:03 PM IST
Sircilla
X

Sircilla: గ్రీవెన్స్ డే వేదికగా బాధితులతో నేరుగా మాట్లాడిన జిల్లా పోలీస్

సిరిసిల్ల: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఈ సోమవారం 36 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్వీకరించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గ్రీవెన్స్ డేలో అందిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా వీలైనంత త్వరగా పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story