Sircilla: సిరిసిల్ల పోలీస్ గ్రీవెన్స్ డే 17 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే. 17 ఫిర్యాదులు స్వీకరించి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 27 July 2026 10:51 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల పోలీస్ గ్రీవెన్స్ డే 17 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

సిరిసిల్ల: బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రజల నుంచి 17 ఫిర్యాదులను స్వీకరించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల వినతులను స్వయంగా ఆలకించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే గ్రీవెన్స్ డే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

గ్రీవెన్స్ డేలో అందిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story