Sircilla: 43 ఏళ్ల సేవలు ప్రశంసనీయం ఎస్‌ఐ రవీందర్ నాయుడికి ఘన సన్మానం!
Sircilla: సిరిసిల్లలో 43 ఏళ్ల సుదీర్ఘ పోలీస్ సేవలు ముగించి పదవీ విరమణ పొందిన ఎస్‌ఐ రవీందర్ నాయుడిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఘనంగా సన్మానించారు.
Sircilla: 43 ఏళ్ల సేవలు ప్రశంసనీయం ఎస్‌ఐ రవీందర్ నాయుడికి ఘన సన్మానం!
Sircilla: 43 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో అంకితభావంతో సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న ఎస్‌ఐ రవీందర్ నాయుడిని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎస్‌ఐ రవీందర్ నాయుడు 43 ఏళ్ల సుదీర్ఘ పోలీస్ సేవలో నిజాయితీ, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించారని కొనియాడారు. విధి నిర్వహణలో సమర్థత, బాధ్యతాయుతమైన వ్యవహారశైలితో పాటు సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీస్ శాఖకు మంచి గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ అనేది సేవా జీవితానికి ముగింపు మాత్రమేనని, సమాజ సేవకు ముగింపు కాదని ఎస్పీ అన్నారు. పదవీ విరమణ అనంతరం రవీందర్ నాయుడు ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
జిల్లాలో కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐగా పోలీసు అధికారుల మధ్య సమన్వయం చేస్తూ రవీందర్ నాయుడు కీలకంగా పనిచేశారని ఎస్పీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు రవీందర్ నాయుడు, శ్రావణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




