Sircilla: మద్యం మత్తులో రెచ్చిపోయిన ఆకతాయిలు.. ఐదుగురికి గాయాలు!

Sircilla: సారంపల్లిలో మద్యం మత్తులో కుటుంబంపై యువకుల దాడి. నెమ్మదిగా వెళ్లమన్నందుకు ఆటో నిలిపి మహిళలతో సహా ఐదుగురిపై దాడి, ఆస్పత్రికి తరలింపు.

KALEEM, SIRICILLA
Published on: 27 Aug 2026 10:07 AM IST
Sircilla
X

Sircilla: మద్యం మత్తులో రెచ్చిపోయిన ఆకతాయిలు.. ఐదుగురికి గాయాలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో అర్ధరాత్రి ఓ కుటుంబంపై యువకులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

రహదారిపై బైక్‌లతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న యువకులను నెమ్మదిగా వెళ్లాలని సూచించినందుకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆటోకు బైక్‌లను అడ్డంగా పెట్టి, ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలతో పాటు మరో ముగ్గురు వ్యక్తులపై యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ దాడిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. ఓ మహిళ కంటిపై తీవ్రంగా గాయమైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రాత్రి వేళల్లో తంగళ్లపల్లి మండలంలోని రహదారులపై కొందరు యువకులు మద్యం సేవించి బైక్‌లపై వేగంగా, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

దాడికి పాల్పడిన యువకులు తంగళ్లపల్లి, పద్మనగర్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం. యువకులు మద్యం సేవించారా? లేక గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకున్నారా? అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేసి తేల్చాల్సి ఉంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story