Sircilla: సిరిసిల్లలో వింత ఆచారం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను (దరిద్ర దేవతను) ఊరి పొలిమేరల్లోకి తరిమికొట్టిన గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు.

BABU, VEMULAWADA
Published on: 12 July 2026 3:22 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో వింత ఆచారం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలో ఆదివారం రోజున జెట్టక్కను గ్రామస్థులందరు కలిసి తరిమికొట్టారు.గ్రామ సర్పంచ్ గండి నారాయణ,మార్కెట్ ఛైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ.గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో వర్షాలు సమృద్ధిగా కూరవలని జెట్టక్కను తిరిమికొట్టమని అన్నారు.వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

వర్షాలు సమృద్ధిగా కూరవలని కోరుకుంటూ గ్రామంలోని జెట్టక్కను అనగా దరిద్ర దేవతను గ్రామంలో నుండి వెల్లగొట్టలనే ఉద్దేశంతో ఇంట్లోని పాతవస్తువులను బట్టలను చీపురు కట్టలను చటలను ఇతర వస్తువులను డప్పుల మోతలతో గ్రామ శివారు వరకు ర్యాలీగా వెళ్లి పడేయడం జరిగిందని అలాగే ట్రాక్టర్ల ద్వారా పాతవస్తులను తరలించడం జరిగిందని అన్నారు.

గ్రామంలోని నాయకులు ప్రజలు పాతవస్తువులతో ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ జెట్టక్కను సాగనాంపరు.జెట్టక్క దరిద్ర దేవత బయటకు వెళ్లి లచ్చక్క అనగా లక్ష్మీదేవి గ్రామంలోకి రావాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని కోరుకున్నట్టు తెలిపారు. వర్షాలు కూరవలని కప్పతల్లి ఆట వరుణ యాగం కూడా చేస్తామని అన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA

Next Story