Sircilla: సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ పరిచయం!
Sircilla: సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమం. అధ్యక్షుడిగా బాణయ్య, కార్యదర్శిగా సత్యనారాయణరావు బాధ్యతల స్వీకరణ.
Sircilla: సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ పరిచయం!
Sircilla: సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ నూతన డిపో కమిటీ పరిచయ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను డిపో మేనేజర్‌కు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా డిపో అధ్యక్షుడిగా సీహెచ్ బాణయ్య, డిపో కార్యదర్శిగా జుకంటి సత్యనారాయణరావు బాధ్యతలు చేపట్టారు. నూతన కమిటీ సభ్యులతో పాటు ఎంప్లాయిస్ యూనియన్ సిబ్బందిని డిపో మేనేజర్‌కు పరిచయం చేశారు. అనంతరం ఎంప్లాయిస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో రీజినల్ సెక్రటరీ కె. కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి కాళిదాసు, రీజినల్ కమిటీ సభ్యుడు పీ. దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎంప్లాయిస్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఆర్టీసీని తిరిగి ప్రభుత్వంలో విలీనం చేసేలా పోరాటం చేస్తామని, ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత కల్పించే దిశగా కృషి చేస్తామని అన్నారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయిస్ యూనియన్ మరింత బలంగా పోరాడుతుందని వెంకన్న తెలిపారు. రాబోయే యూనియన్ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్‌ను గెలిపించి కార్మికుల గొంతుకగా నిలబెట్టాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
నూతన కమిటీ నాయకత్వంలో సిరిసిల్ల డిపో కార్మికుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని యూనియన్ నాయకులు తెలిపారు.




