Sircilla: సిరిసిల్లలో రాజీవ్ గాంధీ జయంతి కొత్త ఓటర్ నమోదు ఫారాల పంపిణీ!
Sircilla: సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. 18 ఏళ్లు నిండిన యువతకు కొత్త ఓటరు నమోదు ఫారాలు అందజేసిన కాంగ్రెస్ నాయకులు.
Sircilla: సిరిసిల్లలో రాజీవ్ గాంధీ జయంతి కొత్త ఓటర్ నమోదు ఫారాల పంపిణీ!
Sircilla: స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన యువతకు కొత్త ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ ఓటర్ నమోదు ఫారాలను అందజేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
భారతదేశంలో కంప్యూటర్, టెలికాం రంగాల్లో విప్లవాత్మక మార్పులకు రాజీవ్ గాంధీ బాటలు వేశారని, నేటి ఐటీ రంగానికి బలమైన పునాది వేశారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చారని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పాలనకు మార్గం సుగమం చేశారని తెలిపారు.
స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాజీవ్ గాంధీ కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాహుల్ గాంధీ పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొలనూరు రమాదేవి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, కౌన్సిలర్లు బొద్దుల శ్రీనివాస్, కూరపాటి శ్రీశైలం, వెంగళ లీల, లక్ష్మీ నర్సయ్య, గోలి రమణ, రాగుల జగన్, మంగ కిరణ్, వేముల రవికుమార్, నేరెళ్ల శ్రీకాంత్, వెంగళ అశోక్, శ్రీరాముల వెంకటేశం, బైరి ప్రభాకర్, వేముల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.




