Sircilla: 9వ పోషణ మాసం సందర్భంగా తల్లులకు అవగాహన

Sircilla: 9వ పోషణ మాసం సందర్భంగా సిరిసిల్ల గీతానగర్ అంగన్‌వాడీ ఆధ్వర్యంలో గృహ సందర్శనలు చేపట్టి తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Sept 2026 3:47 PM IST
Sircilla
X

Sircilla: 9వ పోషణ మాసం సందర్భంగా తల్లులకు అవగాహన

సిరిసిల్ల: 9వ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల గీతానగర్ అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో గురువారం గృహ సందర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ఇళ్లను సందర్శించిన అంగన్‌వాడీ కార్యకర్తలు తల్లులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్యమైన పోషకాహారం తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. పోషకాహార లోపం వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లులకు తెలియజేశారు. కుటుంబ స్థాయిలో పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త సైదా షఫీతో పాటు పలువురు తల్లులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story