Sircilla: పద్మశాలి యువజన సంఘం నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం!
Sircilla: సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సబ్బని హరీష్, డైరెక్టర్లను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ఘనంగా సన్మానించారు.
Sircilla: పద్మశాలి యువజన సంఘం నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన అధ్యక్షుడు సబ్బని హరీష్‌కు ఘన సన్మానం జరిగింది. ఇటీవల జరిగిన సంఘం ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికైన సబ్బని హరీష్, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిందం కళ చక్రపాణి దంపతులు నూతన అధ్యక్షుడు సబ్బని హరీష్‌తో పాటు 3వ, 4వ వార్డు డైరెక్టర్లు కోడం హరీష్, మానాల అరుణ్ కుమార్‌లను శాలువాలతో సత్కరించి అభినందించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
శ్రీ మార్కండేయ స్వామివారి ఆశీస్సులతో పద్మశాలి యువత ఐక్యతను మరింత బలోపేతం చేయాలని సూచించారు. యువతను సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సాంప్రదాయ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ సంఘానికి మంచి పేరు తీసుకురావాలని, ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా పద్మశాలి యువజన సంఘం కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు.




