Sircilla: కేటీఆర్‌ను కలిసిన సిరిసిల్ల పద్మశాలి నేతలు.. సమస్యలపై వినతి

Sircilla: హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసిన సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు. నేతన్నల సమస్యలను విన్నవించగా, సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన మాజీ మంత్రి.

KALEEM, SIRICILLA
Published on: 27 July 2026 9:07 PM IST
Sircilla
X

Sircilla: కేటీఆర్‌ను కలిసిన సిరిసిల్ల పద్మశాలి నేతలు.. సమస్యలపై వినతి

సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను సిరిసిల్ల పద్మశాలి సంఘ నాయకులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్కండేయ మహర్షి చిత్రపటాన్ని అందించి శాలువాతో సన్మానించారు.

అనంతరం పద్మశాలి సంఘానికి సంబంధించిన సమస్యలు, స్థానికంగా ఎదురవుతున్న పలు అంశాలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సానుకూలంగా విన్న కేటీఆర్, తమకు సాధ్యమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌కు పద్మశాలి సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, మండల సత్యం, గాజుల బాలయ్య, గెంట్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story