Sircilla: సిరిసిల్ల ఎస్పీ మహేష్‌ను కలిసిన నూతన ఎస్‌ఐలు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్‌ఐలు ఎస్పీ మహేష్ బి. గితేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేశారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Aug 2026 5:04 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల ఎస్పీ మహేష్‌ను కలిసిన నూతన ఎస్‌ఐలు

సిరిసిల్ల: జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తంగళ్లపల్లి ఎస్‌ఐ అశోక్, ఇల్లంతకుంట ఎస్‌ఐ ఉపేంద్ర చారి, వేములవాడ రూరల్ ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి, కొనరావుపేట ఎస్‌ఐ రామ్మోహన్‌లు ఆయా పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు చేపట్టారు.

అనంతరం నూతన ఎస్‌ఐలు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.

విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story