Sircilla: DCC మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ముస్తాఫా నియామకం

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా DCC మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ముస్తాఫా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన DCC మైనారిటీ చైర్మన్ షేక్ రియాజ్.

KALEEM, SIRICILLA
Published on: 22 Aug 2026 6:19 PM IST
Sircilla
X

Sircilla: DCC మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ముస్తాఫా నియామకం

సిరిసిల్ల: DCC మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ముస్తాఫా నియమితులయ్యారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో DCC మైనారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ముస్తాఫాకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ముస్తాఫా మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరేలా కృషి చేస్తానని చెప్పారు. మైనారిటీలకు అందుతున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పనిచేస్తానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో DCC ప్రధాన కార్యదర్శి షేక్ ఫిరోజ్ పాషా, DCC మైనారిటీ వైస్ చైర్మన్ సలీం, వివిధ మండలాల కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ కరీం, అజీమ్ పాషా, పర్వేజ్, అన్వర్ అలీ, రఫీక్, జాకీర్, ఆఫ్ఫాన్, తాజుద్దీన్, ఇస్మాయిల్, హకీం, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story