Sircilla: సిరిసిల్లలో చేనేత మగ్గాలను పరిశీలించిన కేటీఆర్
Sircilla: సిరిసిల్ల బీవై నగర్‌లో చేనేత కళాకారుడు నల్ల విజయ్ ఏర్పాటు చేసిన అధునాతన మగ్గాలను కేటీఆర్ పరిశీలించారు. ‘వెండి వెన్నెల’ చీరల నైపుణ్యాన్ని ప్రశంసించారు.
Sircilla: సిరిసిల్లలో చేనేత మగ్గాలను పరిశీలించిన కేటీఆర్
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో చేనేత కళాకారుడు నల్ల విజయ్ అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన చేనేత మగ్గాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్లలో అద్భుతమైన చేనేత కళాకారులు ఉండటం అదృష్టమన్నారు. చేనేత కార్మికులు తమ నైపుణ్యంతో అగ్గిపెట్టెలో పట్టే చీరలు తయారు చేయడం అద్భుతమని కొనియాడారు.
మరమగ్గాలు వచ్చిన తర్వాత కూడా చేనేత కళాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ.. మెరుగైన ఉత్పత్తులను అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
చిప్స్ జకాడ్ టెక్నాలజీతో బంగారం, వెండిని ఉపయోగించి ‘వెండి వెన్నెల’ చీరలు తయారు చేయడం గొప్ప కార్యక్రమమని ప్రశంసించారు.
చేనేత కళాకారుడు నల్ల విజయ్ నైపుణ్యాన్ని కేటీఆర్ అభినందించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్ల విజయ్‌కు మంచి కర్మాగారం అందిస్తామని హామీ ఇచ్చారు.




