Sircilla: జపాన్‌లో ఉద్యోగాలు సిరిసిల్ల ITDRను సందర్శించిన బృందం

Sircilla: జపాన్‌లో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు. సిరిసిల్ల బద్దెనపల్లి ITDR డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన హనా విస్టా కన్సల్టింగ్ సీఈఓ సయూరి మత్సునో.

KALEEM, SIRICILLA
Published on: 31 July 2026 5:28 PM IST
Sircilla
X

Sircilla: జపాన్‌లో ఉద్యోగాలు సిరిసిల్ల ITDRను సందర్శించిన బృందం

సిరిసిల్ల: తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను సిద్ధం చేయాలనే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (HanaVista Consulting Pvt. Ltd.) ప్రతినిధులు శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని ITDR డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించారు.

తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ పర్యటనలో సంస్థ సీఈఓ సయూరి మత్సునో శిక్షణా కేంద్రంలోని డ్రైవింగ్ శిక్షణ విధానం, ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణా వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై పరస్పర సహకారం, దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరిపారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పర్యటనలో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్, మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, ITDR ప్రిన్సిపాల్ దొరై మురుగన్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story