Sircilla: సిరిసిల్లలో రాఖీ పండుగ సందడి.. కిటకిటలాడిన మార్కెట్లు

Sircilla: సిరిసిల్ల పట్టణంలో రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని మార్కెట్లు, రాఖీ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.

KALEEM, SIRICILLA
Published on: 27 Aug 2026 7:00 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో రాఖీ పండుగ సందడి.. కిటకిటలాడిన మార్కెట్లు

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా పండుగ సందడి నెలకొంది. గురువారం పట్టణంలోని మార్కెట్ ఏరియా, పెద్దబజార్, ప్రధాన కూడళ్లు, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాఖీ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.

వివిధ రంగులు, ఆకృతులు, డిజైన్లలో రాఖీలు అందుబాటులో ఉండటంతో మహిళలు, యువతులు తమ సోదరుల కోసం రాఖీలను ఎంపిక చేసుకున్నారు. చిన్నారులను ఆకట్టుకునే కార్టూన్ రాఖీలతో పాటు ఫ్యాన్సీ, సంప్రదాయ రాఖీలకు డిమాండ్ కనిపించింది.

రాఖీలతో పాటు మిఠాయిల కొనుగోళ్లు కూడా జోరందుకున్నాయి. స్వీట్లు, చాక్లెట్లు, డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేసేందుకు ప్రజలు మిఠాయి దుకాణాలకు తరలివచ్చారు. సోదరులకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.

ఉదయం నుంచే మార్కెట్ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు పెరగడంతో వ్యాపారులు కూడా బిజీగా కనిపించారు. రాఖీల రంగులు, మిఠాయిల పరిమళంతో సిరిసిల్ల ప్రధాన మార్కెట్లు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story