Sircilla: సిరిసిల్లలో డ్రగ్స్ వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమం

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలని డీఎస్పీ కె. నాగేంద్రచారి పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 25 Jun 2026 2:02 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో డ్రగ్స్ వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రపంచ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో "మన ఊరు నుండి డ్రగ్స్‌ను తరిమికొడదాం" అనే నినాదంతో సిగ్నేచర్ క్యాంపెయిన్ చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పీ కె.నాగేంద్రచారి మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత సిరిసిల్ల నిర్మాణానికి యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని, సరదా, ఒత్తిడి, చెడు స్నేహాల కారణంగా యువత వ్యసనాల బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించి యువతను సరైన మార్గంలో నడిపించడం అందరి బాధ్యత అని తెలిపారు.

డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక, శారీరక, ఆర్థిక సమస్యలతో పాటు నేరప్రవృత్తులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్న డీఎస్పీ, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం, నిరంతర అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సిగ్నేచర్ క్యాంపెయిన్‌లో యువత, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తమ మద్దతు తెలిపారు. హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో మాదకద్రవ్యాలపై మరింత అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె.పున్నంచందర్, మున్సిపల్ కౌన్సిలర్ బుర్ర నారాయణ గౌడ్, హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, అడ్వకేట్ దాసరి తిరుమల, సంస్థ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story