Sircilla: జపాన్‌లో డ్రైవర్ ఉద్యోగాలు - కలెక్టర్ గరిమ అగ్రవాల్

Sircilla: జపాన్‌లో డ్రైవర్ ఉద్యోగాలకు అర్హులైన యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు సిరిసిల్ల కలెక్టర్ తెలిపారు. రూ.80 వేల నుంచి లక్ష వరకు వేతనం, ఐడీటీఆర్‌లో ఉచిత శిక్షణ.

KALEEM, SIRICILLA
Published on: 3 Sept 2026 11:46 PM IST
Sircilla
X

Sircilla: జపాన్‌లో డ్రైవర్ ఉద్యోగాలు - కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల: జపాన్‌లో అర్హులైన యువతకు డ్రైవర్ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జపాన్ సంస్థ ప్రతినిధులు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఐడీటీఆర్ ప్రిన్సిపాల్ దురై మురుగన్‌తో కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు.

తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్‌ (ఐడీటీఆర్)లో జపాన్ సంస్థ ప్రతినిధులు పర్యటించి శిక్షణ, ఇతర అంశాలను పరిశీలించారు.

హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, ఇంగ్లిష్ భాషపై పట్టు ఉన్న 25 ఏళ్ల వయసు కలిగిన యువత ఈ శిక్షణకు అర్హులని కలెక్టర్ తెలిపారు. అర్హులైన యువత మండేపల్లిలోని ఐడీటీఆర్‌ను సంప్రదించాలని సూచించారు.

జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని జిల్లా రవాణా శాఖ, ఐడీటీఆర్ ప్రిన్సిపాల్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఎంపికైన వారికి ఐడీటీఆర్‌లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ, అనంతరం జపాన్ భాషలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.

శిక్షణలో ఎంపికైన వారికి జపాన్‌లో నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనంతో డ్రైవర్ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.

పూర్తి వివరాల కోసం ఐడీటీఆర్ ప్రిన్సిపాల్‌ను 94421 25075 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జపాన్ సంస్థ ప్రతినిధులు ఓసీ బుచి, రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story