Sircilla: బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా: డీఎంఅండ్‌హెచ్‌ఓ ఏంజెలా
Sircilla: సిరిసిల్లలో 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా అందిస్తున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ ఏంజెలా తెలిపారు. తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sircilla: బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా: డీఎంఅండ్‌హెచ్‌ఓ ఏంజెలా
సిరిసిల్ల:
బాలికల ఆరోగ్య రక్షణకు ఉచిత హెచ్‌పీవీ టీకా
తల్లిదండ్రులు ముందుకు రావాలి..డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో కీలకమైన హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్‌ను తెలంగాణ ప్రభుత్వం 14–15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఉచితంగా అందిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు)తో పాటు గుర్తించిన టీకా కేంద్రాల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. టీకా అనంతరం 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
హెచ్‌పీవీ టీకాపై అపోహలను నమ్మవద్దని, ఇది పూర్తిగా సురక్షితమైన టీకా అని ఆమె స్పష్టం చేశారు. కొంతమందిలో ఇంజెక్షన్ ఇచ్చిన చోట స్వల్ప నొప్పి లేదా తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపించినా అవి తాత్కాలికమేనన్నారు.
అర్హులైన ప్రతి బాలికకు టీకా అందేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ విజ్ఞప్తి చేశారు. బాలికల భవిష్యత్తు ఆరోగ్య రక్షణ కోసం ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




