Sircilla: సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ వార్డు కార్యకర్తల సమావేశం
Sircilla: సిరిసిల్లలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో వార్డు కార్యకర్తల సమావేశం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు.
Sircilla: సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ వార్డు కార్యకర్తల సమావేశం
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో 3, 16, 28 వార్డుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రానున్న కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వేల్ముల స్వరూప, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, కాంగ్రెస్ చేనేత సెల్ టౌన్ అధ్యక్షుడు గుడిసెట్టి బాలరాజ్, నాయకులు గాధ మైసయ్య, నీలి రవీందర్, గుంజే రమేష్, దేవదాసు, శివ, ఆడెపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




