Sircilla: సిరిసిల్లలో కాంగ్రెస్ నిరసన.. మోదీ దిష్టిబొమ్మ దహనం

Sircilla: రాహుల్ గాంధీపై పోలీసుల చర్యను ఖండిస్తూ సిరిసిల్ల గాంధీ చౌక్‌లో కాంగ్రెస్ ర్యాలీ. మోదీ దిష్టిబొమ్మ దహనం వద్ద ఉద్రిక్తత. పోలీసులతో కార్యకర్తల వాగ్వాదం.

Venkata Thirumala
Published on: 23 July 2026 4:22 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో కాంగ్రెస్ నిరసన.. మోదీ దిష్టిబొమ్మ దహనం

సిరిసిల్ల: ఢిల్లీలో రాహుల్ గాంధీపై పోలీసుల చర్యలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన పోలీసులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు మాట్లాడుతూ.. నీట్ అంశంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పోలీసుల చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనను అణచివేయడం సరికాదన్నారు. విద్యార్థుల ఉద్యమాలను అణచివేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story