Sircilla: సమస్యల పరిష్కారానికే ప్రజావాణి.. జిల్లా కలెక్టర్ అగ్రవాల్

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ 159 అర్జీలను స్వీకరించారు.

KALEEM, SIRICILLA
Published on: 22 Jun 2026 8:18 PM IST
Sircilla
X

Sircilla: సమస్యల పరిష్కారానికే ప్రజావాణి.. జిల్లా కలెక్టర్ అగ్రవాల్

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. మొత్తం 159 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రతి సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖితా రెడ్డి, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story