Sircilla: కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ ప్రజావాణి పరిశీలన!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు జారీ.
Sircilla: కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ ప్రజావాణి పరిశీలన!
Sircilla: మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే చేయూత నూతన పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. పెన్షన్ కోసం అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు రెవెన్యూ డివిజన్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణుతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.




