Sircilla: జలాశయాల నీటి నిల్వలపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష!
Sircilla: ఎగువ మానేరు జలాశయాల నీటి నిల్వలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులతో కలిసి కీలక సమీక్ష నిర్వహించారు.
Sircilla: జలాశయాల నీటి నిల్వలపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జలాశయాల నీటి నిల్వలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్.. మధ్యమానేరు, ఎగువ మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్ల ప్రస్తుత నీటి నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎస్సారెస్పీ ఫ్లడ్ ఫ్లో కెనాల్, మూలవాగు, మానేరు వాగు వరద జలాలతో పాటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ద్వారా మధ్యమానేరు జలాశయాన్ని నింపుతున్నట్లు అధికారులు వివరించారు. అలాగే మల్లన్నసాగర్, కూడవెల్లి, పాల్వంచ వాగుల ద్వారా ఎగువ మానేరు జలాశయానికి నీరు చేరుతున్నట్లు తెలిపారు.
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా నీటి నిల్వలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో ప్రజలకు తాగునీరు అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో నీటి పారుదల, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.




