Sircilla: సిరిసిల్ల ప్రజావాణి దరఖాస్తుల త్వరిత పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణికి 142 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.

KALEEM, SIRICILLA
Published on: 24 Aug 2026 6:52 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల ప్రజావాణి దరఖాస్తుల త్వరిత పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం

సిరిసిల్ల: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ఐడీఓసీ ప్రజావాణికి మొత్తం 142 దరఖాస్తులు రాగా.. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 6 దరఖాస్తులు, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో 5 దరఖాస్తులు వచ్చాయి.

మండలాల్లోనూ ప్రజావాణి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపించారు.

మండలాల వారీగా బోయినపల్లిలో 9, ఇల్లంతకుంటలో 10, గంభీరావుపేటలో 10, కోనరావుపేటలో 2, ముస్తాబాద్‌లో 11, రుద్రంగిలో 2, తంగళ్లపల్లిలో 10, వీర్నపల్లిలో 7, వేములవాడ అర్బన్‌లో 5, వేములవాడ రూరల్‌లో 12, ఎల్లారెడ్డిపేటలో 3 దరఖాస్తులు వచ్చాయి. చందుర్తి మండలంలో ఎలాంటి దరఖాస్తులు రాలేదు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలిపారు.

ఐడీఓసీ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story