Sircilla: విద్యార్థులు ప్రతి పాఠ్యాంశంపై పట్టు సాధించాలి కలెక్టర్!

Sircilla: సిరిసిల్ల అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. విద్యార్థులతో ముచ్చటించి భోజన నాణ్యత, పాఠ్యాంశాలపై ఆరా.

KALEEM, SIRICILLA
Published on: 3 Aug 2026 3:42 PM IST
Sircilla
X

Sircilla: విద్యార్థులు ప్రతి పాఠ్యాంశంపై పట్టు సాధించాలి కలెక్టర్!

సిరిసిల్ల: విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి పాఠ్యాంశంపై పూర్తి అవగాహన సాధించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

సోమవారం సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్‌రూమ్‌లో బియ్యం, పప్పులు, గుడ్లు తదితర ఆహార నిల్వలను పరిశీలించారు. అలాగే ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు.

అనంతరం తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులోని అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే చదువుతో పాటు విరామ సమయంలో ఆటలు ఆడుతూ శారీరక దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story