Sircilla: అంగన్వాడీ కేంద్రంలో కలెక్టర్ తనిఖీ: పోషకాహార పంపిణీపై ఆరా!
Sircilla: రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ రగుడు అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలని ఆదేశించారు.
Sircilla: అంగన్వాడీ కేంద్రంలో కలెక్టర్ తనిఖీ: పోషకాహార పంపిణీపై ఆరా!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం క్రమం తప్పకుండా అందించాలని అధికారులను ఆదేశించారు.
కేంద్రంలో కోడిగుడ్లు, బాలామృతం, పిల్లల కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని పరిశీలించిన కలెక్టర్.. రోజువారీ హాజరు, బోధన విధానంపై ఆరా తీశారు. ఆటపాటల ద్వారా చిన్నారులకు బోధన చేయాలని సూచించారు.
అంగన్వాడీ సేవలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలు ప్రతిరోజూ కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
Next Story




